'ఓ బేబీ' నుంచి ఆకట్టుకునే పాట
Advertisement
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ' రూపొందింది. సీనియర్ హీరోయిన్ లక్ష్మీ కీలమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

"మహా అద్భుతం కదా .. అదే జీవితం కదా .. " అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ. జె మేయర్ సంగీతం .. భాస్కరభట్ల సాహిత్యం .. నూతన మోహన్ ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. జీవిత సత్యాలని ఈ పాట ద్వారా ఒక పాఠంగా చెప్పడానికి భాస్కరభట్ల చాలా సరళమైన పదాలను ఉంపయోగించాడు. 'తీపి కావాలంటే చేదు మింగాలంతే .. కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా' అనే వరసలు బాగున్నాయి. నాయికను ముందుకు నడిపించే నేపథ్యంలో వచ్చే ఈ పాటను నూతన మోహన్ బాగా పాడింది.
Mon, Jun 17, 2019, 10:29 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View