సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ కి మరో భారీ ఆఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయికగా రకుల్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  హీరో మహేశ్ బాబు ఇటీవల తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి యూరప్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలలో పర్యటించారు. కాగా, ఈ పర్యటనను ముగించుకుని మహేశ్ ఫ్యామిలీ నిన్న హైదరాబాదుకు చేరుకుంది.
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తాజాగా ఓ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. నరసింహారావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూలు పది రోజుల పాటు జరుగుతుంది.
Mon, Jun 17, 2019, 07:18 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View