పాకిస్థాన్ ను దెబ్బకొట్టిన కుల్దీప్ యాదవ్... గెలుపు దిశగా టీమిండియా!
Advertisement
భారత్ విసిరిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓ దశలో నిలకడ ప్రదర్శించిన పాకిస్థాన్ ఆపై కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకుంది. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్ తో ఫఖార్ జమాన్ (62), బాబర్ అజామ్ (48)లను అవుట్ చేయడంతో పాకిస్థాన్ కు గట్టి దెబ్బ తగిలింది. వీరిద్దరూ 9 పరుగుల తేడాతో వెనుదిరిగారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య కీలకమైన హఫీజ్ వికెట్ తీయడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పాకిస్థాన్ 26.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 23.1 ఓవర్లలో 208 పరుగులు చేయాలి.
Sun, Jun 16, 2019, 10:06 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View