అమెరికాలో తెలుగు వ్యక్తుల అనుమానాస్పద మృతి... ఒకే ఇంట్లో బుల్లెట్ గాయాలతో నాలుగు మృతదేహాలు
Advertisement
అమెరికాలో ఒకే ఇంట్లో నలుగురు తెలుగువాళ్ల మృతదేహాలు లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ నలుగురు శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉండడంతో అనుమానాస్పద మరణాలుగా భావిస్తున్నారు. మృతిచెందిన వారిని చంద్రశేఖర్, లావణ్య, మరో ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు. వీరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, స్థానికుల కథనం ప్రకారం, చంద్రశేఖరే మిగతా ముగ్గురినీ తుపాకీతో కాల్చి, ఆపై తాను కాల్చుకున్నట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ గతకొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనైనట్టు ఇరుగుపొరుగు చెబుతున్నారు. అయోవా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన అమెరికాలోని తెలుగు వర్గాల్లో విషాదం నింపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sun, Jun 16, 2019, 09:06 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View