సెట్స్ మీద ఉన్నప్పుడు మేం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఏ విధంగా చూశామంటే..!: అల్లు అర్జున్ క్రికెట్ మేనియా
Advertisement
ఎక్కడ చూసినా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ గురించే చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ కొన్నిరోజుల ముందునుంచే హడావుడి మొదలుకాగా, ఇవాళ అది పతాకస్థాయికి చేరింది. సెలబ్రిటీస్ చాలామంది మ్యాచ్ జరుగుతున్న మాంచెస్టర్ లో వాలిపోగా, మరికొందరు తాము పనిచేస్తున్న చోటే మ్యాచ్ ను వీక్షించారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడంతో సెట్స్ మీదే ఖాళీ దొరికినప్పుడల్లా టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను తిలకించారు.

బన్నీ ఇంట్రస్టింగ్ మ్యాచ్ ను చూస్తుండగా, హీరోయిన్ పూజా హెగ్డే దాన్ని వీడియోగా రికార్డు చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. మేం సెట్స్ మీద ఈ మ్యాచ్ ను ఏ విధంగా చూశామంటే అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ తో బన్నీ బిజీగా ఉన్నారు.

Sun, Jun 16, 2019, 08:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View