మళ్లీ మొదలైన ఆట... పాకిస్థాన్ కు 337 రన్స్ టార్గెట్ ఇచ్చిన టీమిండియా
Advertisement
మాంచెస్టర్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ అడ్డంకి తొలగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 47వ ఓవర్లో వర్షం అంతరాయం కలిగించడంతో ఆట నిలిచిపోయింది. కాసేపటికి వర్షం ఆగడంతో మ్యాచ్ కొనసాగించారు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడడానికి ప్రయత్నించిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు, ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. చివర్లో విజయ్ శంకర్ 15 బంతుల్లో 15 పరుగులు చేశాడు.
Sun, Jun 16, 2019, 07:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View