త్వరలో బీజేపీలో భారీగా చేరికలు: బీజేపీ నేత లక్ష్మణ్
Advertisement
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు జరగనున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ సహా పలువురు నేతలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయా పార్టీల నేతలు తమ పార్టీలో చేరికలకు ముందు వారు రాజీనామాలు చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లోనే స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.
Sun, Jun 16, 2019, 07:00 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View