జగన్, కేసీఆర్, చంద్రబాబులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి లేఖ
Advertisement
పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయా పార్టీల అధ్యక్షులకు ప్రత్యేకంగా లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి లేఖ అందింది. ప్రధానంగా 5 లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో ఈ నెల 19న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్నారు.

పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి... ఈ సమావేశంలో చర్చించనున్న 5 ప్రధాన అంశాలు. ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలంటూ పార్టీల అధినేతలను కేంద్రం తమ లేఖలో కోరింది.
Sun, Jun 16, 2019, 02:13 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View