విజయవాడ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం!: ఏపీ మంత్రులు ధర్మాన, వెల్లంపల్లి
Advertisement
విజయవాడ వాసుల చిరకాల స్వప్నం అయిన దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేశామని ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తామని ప్రకటించారు. విజయవాడ వాసులకు న్యూఇయర్ బహుమతిగా ఫ్లైఓవర్ ను అందిస్తామని చెప్పారు. ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ను మార్చడం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిందని వ్యాఖ్యానించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.10 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
Sun, Jun 16, 2019, 01:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View