న్యూజిలాండ్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు!
16-06-2019 Sun 10:39
- 7.2 తీవ్రతతో ప్రకంపనలు
- తొలుత సునామీ హెచ్చరికలు.. అనంతరం ఉపసంహరణ
- భారీగా అలలు ఎగిసిపడే ఛాన్స్

న్యూజిలాండ్ లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య న్యూజిలాండ్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఈరోజు రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ పౌరరక్షణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీచేసింది. దీంతో ప్రజలంతా ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీశారు.
అయితే 8 నిమిషాల అనంతరం ఈ హెచ్చరికలను న్యూజిలాండ్ ఉపసంహరించుకుంది. సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్నప్పటికీ న్యూజిలాండ్ తీరంలో భారీగా అలలు ఎగిసిపడతాయని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రజలు తీరప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించింది. కాగా, భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
More Latest News
మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో 144 సెక్షన్
4 minutes ago

జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్’.. పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులు తేవడంపై రాహుల్ గాంధీ ఫైర్
12 hours ago

'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!
12 hours ago
