బిగ్ బాస్-3 వచ్చేస్తోంది... అఫీషియల్ ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా!
Advertisement
తెలుగు బుల్లితెర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మూడో సీజన్ రెడీ అవుతోంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని స్టార్ మా అధికారిక ప్రోమోను విడుదల చేసింది. తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని నడిపించగా, థర్డ్ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా రాబోతున్నారన్న సంగతి తెలిసిందే. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన నాగ్, బిగ్‌ బాస్‌ సీజన్ 3ని ముందుండి నడిపించనున్నారు.

కాగా, మూడో సీజన్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని మాత్రం స్టార్ మా ప్రకటించలేదు. జులై మూడోవారం లేదా నాలుగోవారంలో ఇది ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ దఫా బిగ్‌ బాస్‌ మరింత కొత్తగా సాగుతుందని ప్రోమోను చూస్తే తెలుస్తోంది. హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరన్న విషయమై ఇంకా ప్రకటన వెలువడాల్సివుంది. దానికి సంబంధించిన ఓ అనఫీషియల్ లిస్ట్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. కామన్‌ మ్యాన్‌ కు ఈ సీజన్ లో ఎంట్రీ లేదని సమాచారం. హోస్ట్ గా నాగ్ పనిచేయనున్నారన్న వార్తలపైనా అధికారిక సమాచారం తెలియాల్సివుంది.
Sun, Jun 16, 2019, 09:05 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View