పోలీసుల డ్రంకెన్ డ్రైవ్... చేతిలో బాటిల్ తోనే కారు దిగిన మందుబాబు!
Advertisement
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ లో పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, ఓ మందు బాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. జూబ్లీహిల్స్ నీరుస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, పూటుగా మందు కొట్టిన ఓ వ్యక్తి, కారు నడుపుకుంటూ వచ్చాడు. కారు దిగాలని పోలీసులు కోరితే, దిగకుండా నానాయాగీ చేశాడు. చివరకు పోలీసులు అతన్ని కిందకు దించగా, తన చేతిలో మందు బాటిల్ తోనే దిగాడు. కారు దిగిన తరువాత కూడా పోలీసుల ముందే మందు కొడుతూ హల్ చల్ చేశాడు. తప్పు మీద తప్పు చేస్తూనే పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

దీంతో పోలీసులు ఒకింత ఆగ్రహానికి లోనవుతూ, ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, నిన్నటి తనిఖీల్లో మొత్తం 48 మంది మందు కొట్టి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, మొత్తం 20 కార్లు, 28 బైక్‌ లను సీజ్ చేశామని తెలిపారు. పట్టుబడిన వారికి సోమవారం నాడు బేగంపేటలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.
Sun, Jun 16, 2019, 08:40 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View