రూ.2.5 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను మా యోగా టీచర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశా: బాలీవుడ్ ‘క్వీన్’ కంగన
Advertisement
క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో అభిమానులకు దగ్గరైన బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు ఇప్పటి వరకు సొంత సోషల్ మీడియా ఖాతా లేదంటే ఆశ్చర్యమే. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు లేకపోవడంతో  ఆమె సోదరి, మేనేజర్ అయిన రంగోలి చందేల్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. తనకు సోషల్ మీడియా ఖాతాలు లేకపోవడంపై ఇటీవల కంగన స్పందిస్తూ.. తన చుట్టూ ఏం జరుగుతోందన్న దానిపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటికి సోషల్ మీడియాలో పరిష్కారం వెతుకుతూ సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది.

అలాగే, ఎవరికీ తెలియని మరో విషయాన్ని వెల్లడించింది. తన యోగా టీచర్‌కు రూ.2.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్టు పేర్కొంది. అలాగే, ఆసుపత్రులు కట్టడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నట్టు చెప్పింది. ఈ విషయాలు ఎవరికీ తెలియవని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను తన సోదరి ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తుంటుందని, అది తనకు ఫన్నీగా అనిపిస్తుందని పేర్కొంది. ఇటువంటి వాటికి తాను వ్యతిరేకమని కంగన చెప్పుకొచ్చింది.
Sun, Jun 16, 2019, 07:56 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View