మాధవన్ భార్య పాత్రలో సిమ్రన్
Advertisement
తమిళంలో సీనియర్ హీరోగా మాధవన్ కి ఎంతో క్రేజ్ వుంది. అలాగే సీనియర్ హీరోయిన్ గా సిమ్రన్ కి కూడా మంచి ఇమేజ్ వుంది. 18 ఏళ్ల క్రితం తొలిసారిగా ఈ ఇద్దరూ బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'పరవశం' చిత్రంలో జంటగా నటించారు. ఆ తరువాత మణిరత్నం సినిమాలోను మెరిసిన ఈ జంట, మళ్లీ కలిసి నటించింది లేదు.

అలాంటి ఈ జంట మళ్లీ ఇంతకాలానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మాధవన్ కథానాయకుడిగా .. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ బయోపిక్ తమిళంలో రూపొందుతోంది. 'రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్' అనే టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. నంబి నారాయణ పాత్రలో మాధవన్ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో సిమ్రన్ కనిపించనుంది. మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, షారుక్ .. సూర్య అతిథి పాత్రల్లో కనిపించనుండటం విశేషం. 
Sat, Jun 15, 2019, 05:54 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View