టీడీపీ ఓటమికి పవన్ కల్యాణే కారణం: సుమన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓటమికి పవన్ కల్యాణే కారణమని ఆయన చెప్పారు. ఒక పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడాన్ని తాను పుట్టిన తర్వాత చూడటం ఇదే తొలిసారని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి జగన్ విజయాన్ని కైవసం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం ద్వారా సమన్యాయాన్ని జగన్ చేశారని కితాబిచ్చారు. సినీ పరిశ్రమను కూడా ఏపీకి తీసుకొచ్చి, ఇండస్ట్రీని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
Sat, Jun 15, 2019, 05:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View