క్రిష్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టిపెట్టాడట
Advertisement
ఎన్టీఆర్ బయోపిక్ గా 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' సినిమాలను దర్శకుడు క్రిష్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ రెండు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో క్రిష్ తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందా అనే ఆసక్తి అందరిలోను వుంది. అయితే ఆయన ఏ హీరోతోనూ కొత్త ప్రాజెక్టును ప్రకటించకపోవడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు.

క్రిష్ ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించకపోవడానికి కారణం, ఆయన వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టడమేనని అంటున్నారు. తన సొంత బ్యానర్లో ఆయన వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారట. దానికి సంబంధించిన కథ .. స్క్రీన్ ప్లే - మాటలను పూర్తి చేశారని సమాచారం. ఆ వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను వేరెవరికైనా అప్పగించి, అప్పుడు తదుపరి సినిమా కోసం క్రిష్ రంగంలోకి దిగుతాడని అంటున్నారు.
Sat, Jun 15, 2019, 04:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View