'విరాటపర్వం' షూటింగ్ మొదలైపోయింది
Advertisement
రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం' రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో వెంకటేశ్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది.దగ్గుబాటి సురేశ్ .. చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి కనిపించనుంది. ఈ ప్రాజెక్టుపై చాలాకాలం క్రితమే కసరత్తు మొదలైంది. అయితే ఒక వైపున రానా .. మరో వైపున సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆలస్యమైంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Sat, Jun 15, 2019, 03:14 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View