'మహావీర్ కర్ణన్' ఆలస్యానికి అదే కారణమట
Advertisement
తమిళనాట సీనియర్ స్టార్ హీరోల జాబితాలో విక్రమ్ కనిపిస్తాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి విక్రమ్ కేరాఫ్ అడ్రెస్. అలాంటి విక్రమ్ కథానాయకుడిగా 'మహావీర్ కర్ణన్' అనే భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమాకి సంబంధించిన సందడి ఎక్కడా కనిపించకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందేమోనని అనుకున్నారు.

కానీ దర్శక నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారనీ, విక్రమ్ దే ఆలస్యమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా 'ఆదిత్య వర్మ' సినిమా నిర్మితమవుతోంది. ధృవ్ కి ఇది తొలి సినిమా కావడం వలన, అన్ని వ్యవహారాలను విక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఈ సినిమా విడుదలయ్యేవరకూ వెయిట్ చేయమని 'మహావీర్ కర్ణన్'ను ఆయన హోల్డ్ లో పెట్టేశారని చెబుతున్నారు. 'ఆదిత్య వర్మ' విడుదల తరువాతనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందన్న మాట. 
Sat, Jun 15, 2019, 01:55 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View