అజిత్ వంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు: నటుడు 'ఛత్రపతి' శేఖర్
Advertisement
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన నటుడిగా 'ఛత్రపతి' శేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన హీరో అజిత్ గురించి ప్రస్తావించారు. "తమిళనాట అజిత్ సూపర్ స్టార్ .. అలాంటి ఆయనతో కలిసి నటించే అవకాశం నాకు కలిగింది. అందువలన నేను ఆయనను చాలా దగ్గరగా చూడగలిగాను.

సెట్లోకి అడుగుపెడుతూనే ఆయన అందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అసిస్టెంట్ తో గొడుగు పట్టించుకోవడం ఆయనకి ఇష్టం వుండదు. ఎంత ఎండలోనైనా దర్శకుడు చెప్పింది అలా నిలబడే వింటారు .. చేస్తారు. తన స్టార్ డమ్ ను పూర్తిగా పక్కన పెట్టేసి, అందరిలో ఒకరుగా కలిసిపోతారు. ఒక ఇంటర్వ్యూలో నేను అజిత్ ను గురించి చెప్పడం ఆయన చూశారు. మరుసటి రోజు సెట్లో నా దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ 'థ్యాంక్స్' చెప్పారు. దాంతో నేను మరింత షాక్ అయ్యాను" అని చెప్పుకొచ్చారు. 
Sat, Jun 15, 2019, 11:27 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View