'మన్మథుడు 2' నుంచి రానున్న రకుల్ టీజర్
Advertisement
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. ఒక కథానాయికగా రకుల్ .. మరో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

నాగ్ రోల్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఆయనకి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. అయితే ఈ టీజర్లో రకుల్ కనిపించకపోవడంపై అందరిలో సందేహాలు తలెత్తాయి. దాంతో రకుల్ పాత్రకి సంబంధించిన సన్నివేశాలపై ప్రత్యేకంగా మరో టీజర్ ను వదులుతామనీ, అందువల్లనే తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో రకుల్ ను చూపించలేదని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశాడు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నామని ఆయన అన్నాడు.
Sat, Jun 15, 2019, 10:37 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View