సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం 1992' చిత్రం రూపొందనుంది. వచ్చే నెల నుంచి షూటింగ్ నిర్వహిస్తారు. ముందుగా హీరోయిన్ సాయిపల్లవి పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ప్రముఖ నటి టబు ఇందులో కీలక పాత్ర పోషించనుంది.
*  రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం మాల్దీవులలో చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే షూటింగులో మిగతా పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
*  'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రానికి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం ప్రదర్శన హక్కులు రికార్డు స్థాయి ధరల్లో అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రదర్శన హక్కులకు 20 కోట్ల ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.  
Sat, Jun 15, 2019, 07:20 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View