స్క్రీన్ ముందు చొక్కాలు విప్పిన ప్రభాస్ ఫ్యాన్స్... వీడియో షేర్ చేసిన శ్రద్ధా కపూర్
Advertisement
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ సినిమా టీజర్ వచ్చీరావడంతోనే ఆన్ లైన్ లో ప్రకంపనలు సృష్టించింది. కేవలం కొద్దిసమయంలోనే రెండు కోట్ల వ్యూస్ అందుకుని రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. సాహో టీజర్ ను దేశవ్యాప్తంగా అనేక థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఓ థియేటర్ లో సాహో టీజర్ వస్తుండగా అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి ఆనందోత్సాహాలతో నర్తించడాన్ని శ్రద్ధా కపూర్ ఓ వీడియో రూపంలో ప్రభాస్ అభిమానులకు షేర్ చేసింది. చొక్కాలు విప్పుకుని మరీ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. కాగా, సాహో దర్శకుడు సుజీత్ చెబుతున్న మాటలను బట్టి, కథను మలుపుతిప్పే పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది. టీజర్ లో కూడా ప్రభాస్ కు బదులుగా మొదట ఆమెనే చూపించడం ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తోంది.

Fri, Jun 14, 2019, 04:42 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View