'సాహో' డిజిటల్ వ్యూస్ అదరహో!
Advertisement
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ సాహో చిత్రానికి సంబంధించి చిన్నవార్త వచ్చినా చాలు అభిమానులు పండగ చేసుకున్నారు. అలాంటిది ఇవాళ ఏకంగా టీజర్ వచ్చేసరికి ఫ్యాన్స్ ఆనందం అంబరాన్నంటుతోంది. సాహో చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నా, టీజర్ చూసిన తర్వాత ఎన్నడూలేనంత హైప్ క్రియేట్ అయింది. ఆన్ లైన్ లో సాహో టీజర్ కు లభిస్తున్న డిజిటల్ వ్యూసే అందుకు నిదర్శనం. టీజర్ రిలీజైన కేవలం 6 గంటల్లోనే 2.5 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్ ఆన్ లైన్ మీడియంలో దుమ్మురేపుతోంది. సరికొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. ఈ టీజర్ ఒక్క హిందీలోనే అత్యధికంగా 62 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. తెలుగులో 51 లక్షల వ్యూస్ లభించాయి. ప్రభాస్ నటించిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం సమ్మోహనం చెందుతున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు.
Thu, Jun 13, 2019, 06:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View