వినాయక్ క్లాప్ తో బాలకృష్ణ 105వ సినిమా మొదలు
Advertisement
బాలకృష్ణ 105వ సినిమాకి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా .. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు సన్నివేశానికి కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి 'క్రాంతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని అంటున్నారు. కథానాయికల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. 'జై సింహా' తరువాత బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి వుంది.
Thu, Jun 13, 2019, 05:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View