యాభై శాతం నష్టాలు తెచ్చిపెట్టిన 'ఎన్జీకే'
Advertisement
సూర్య కథానాయకుడిగా నిర్మితమైన 'ఎన్జీకే' క్రితం నెల 31న తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సూర్య సరసన రకుల్ - సాయిపల్లవి కథానాయికలుగా నటించారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు యాభై శాతం నష్టాలను మిగిల్చినట్టు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 9 కోట్లకి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అమ్మారు. ఇంతవరకూ మొత్తం ఈ సినిమా 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో యాభై శాతం నష్టాలతో బాక్సాఫీస్ రన్ క్లోజ్ చేశారు. ఇక తెలుగులో పరిస్థితి ఇలా వుంటే, తమిళంలోను ఈ సినిమా పరాజయంపాలైనట్టు సూర్య స్వయంగా చెప్పేయడం విశేషం. ప్రస్తుతం సూర్య తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టారు.
Thu, Jun 13, 2019, 04:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View