యాగంటిలో యాక్షన్ కి దిగిపోయిన 'వాల్మీకి'
Advertisement
హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' రూపొందుతోంది. ఈ మధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ నిమిత్తం 'యాగంటి' చేరుకుంది. దర్శకుడు హరీశ్ శంకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

శివుని ఆశీస్సులతో .. యాగంటి వంటి అద్భుతమైన ప్రదేశంలో షూటింగును మొదలుపెట్టాము అని అన్నాడు. అక్కడ ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ .. బ్రహ్మాజీ తదితరులు ఈ యాక్షన్ సీన్లో పాల్గొంటున్నారు. గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జిగర్తాండ'కి ఇది రీమేక్. వరుణ్ తేజ్ తో పాటు అధర్వ మురళి నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇక మరో కథానాయికగా ఒక తెలుగు అమ్మాయిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
Thu, Jun 13, 2019, 02:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View