రొమాంటిక్ హీరోగా మళ్లీ అదరగొట్టేసిన నాగ్
Advertisement
 నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికలుగా రకుల్ - కీర్తి సురేశ్ నటిస్తున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ప్రధానపాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.వయసు ముదిరిపోతున్నా నాగ్ కి ఇంకా పెళ్లి కాకపోవడం గురించిన ఫన్నీ సన్నివేశాలపైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. 'ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్ .. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?' అనే డైలాగ్ అందుకు నిదర్శనం. చాలాకాలం తరువాత నాగార్జున మళ్లీ ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా విజృంభించినట్టు ఈ టీజర్ ను బట్టి తెలిసిపోతోంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Thu, Jun 13, 2019, 01:46 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View