బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదు... వ్యాఖ్యాతగా అయితే చేస్తా: సినీ నటి రేణూదేశాయ్‌
Advertisement
స్టార్‌ మా టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రాం బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌కు వ్యాఖ్యాతగా అవకాశం వస్తే వదులుకోనని, తప్పకుండా పనిచేస్తానని సెలబ్రిటీ, సినీ నటి  రేణూదేశాయ్‌ స్పష్టం చేశారు. ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారన్న వార్తలు ఎప్పటి నుంచో షికారు చేస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు ఆమెను సంప్రదించారని, అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా ద్వారా రేణూదేశాయ్‌ ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అయితే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాలని మాత్రం అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఓ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు.

ఒకవేళ బిగ్‌బాస్‌ నిర్వాహకులు వ్యాఖ్యాతగా వ్యవహరించాలని తనను సంప్రదిస్తే మాత్రం అవకాశం వదులుకోనని చెప్పారు. అటువంటి సూపర్‌ హిట్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనలోని నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. బిగ్‌ బాస్‌ మొదటి సీజన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌లో నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మూడో సీజన్‌లో నాగార్జున కానీ, వెంకటేశ్ ‌గాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.
Thu, Jun 13, 2019, 12:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View