ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ లా 'కల్కి' ఉత్కంఠను రేపుతుంది: దర్శకుడు ప్రశాంత్ వర్మ
Advertisement
'కల్కి' .. ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఈ సినిమాను గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రాజశేఖర్ కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాను గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో రాజశేఖర్ మరింత అద్భుతంగా చేశారు. నిర్మాత కల్యాణ్ గారు ఖర్చుకు వెనుకాడలేదు .. ఆ విషయం మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతటి ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుంది. త్వరలో ట్రైలర్ ను వదలనున్నాము" అని చెప్పాడు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించిన సంగతి తెలిసిందే.
Thu, Jun 13, 2019, 12:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View