విలన్ పాత్రలో విజయ్ సేతుపతి
Advertisement
ఒక వైపున తమిళంలో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తోన్న విజయ్ సేతుపతి, ఇటీవల కాలంలో తెలుగు సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు. 'సైరా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించిన ఆయన, ఆ సినిమా విడుదలకి ముందే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. అదే 'ఉప్పెన'.

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతిని తీసుకోగానే ఆయన పాత్ర ఎలాంటిదై వుంటుందనే ఆసక్తి అందరిలోను తలెత్తింది. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ కి తండ్రిగా .. హీరోను ఎదుర్కునే విలన్ గా కనిపిస్తాడనేది తాజా సమాచారం. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Thu, Jun 13, 2019, 11:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View