'సాహో' టీజర్ తో దుమ్మురేపేస్తోన్న ప్రభాస్
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ .. యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

సినిమా భారీతనానికి ఈ టీజర్ అద్దం పడుతూ అంచనాలు పెంచుతోంది. ప్రభాస్ సినిమా నుంచి ఆయన అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రభాస్ లుక్ .. ఆయన కాస్ట్యూమ్స్ .. ఆయన వాడిన బైక్ .. శ్రద్ధా కపూర్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
Thu, Jun 13, 2019, 11:31 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View