ఓటమి దిశగా పాకిస్థాన్... చెలరేగిన కమిన్స్
Advertisement
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి బాటలో పయనిస్తోంది. 308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 33 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆసీస్ యువ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టాడు. ఓ దశలో 2 వికెట్లకు సెంచరీ మైలురాయి దాటిన పాక్ ఆ తర్వాత అనూహ్యరీతిలో వికెట్లు చేజార్చుకుంది. 136/2తో ఉన్న జట్టు 160/6కి చేరుకుంది.

నిలకడగా ఆడుతున్న ఓపెనర్ ఇమాముల్ హక్ హాఫ్ సెంచరీ పూర్తికాగానే కమిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ హఫీజ్ కూడా వెనుదిరిగాడు. ఆదుకుంటాడనుకున్న షోయబ్ మాలిక్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ వికెట్ కూడా కమిన్స్ కే దక్కింది. ప్రస్తుతం పాక్ గెలవాలంటే 17 ఓవర్లలో 117 పరుగులు చేయాలి. చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే మిగిలున్న స్థితిలో పాక్ విజయం అసాధ్యంగానే కనిపిస్తోంది.
Wed, Jun 12, 2019, 09:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View