ఇకపై డ్రోనుల సాయంతో ఫుడ్‌ను డెలివరీ చేయనున్న జొమాటో
Advertisement
ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో ఇకపై ఆహార పదార్థాలను డ్రోనుల సాయంతో తన కస్టమర్లకు అందించనుంది. దీనికి సంబంధించిన పరీక్షను నిర్వహించి విజయవంతమైంది. నేడు జొమాటో సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, హైబ్రీడ్ డ్రోన్ సాయంతో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాణికుడికి 10 నిమిషాల్లో ఆహారాన్ని అందించే పరీక్ష విజయవంతమైందని తెలిపారు.

ఆ డ్రోను గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించిందని తెలిపారు. ఆకాశ మార్గం ద్వారా చాలా త్వరగా ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా సమయాన్ని కూడా సగానికి తగ్గించవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులకు తక్షణమే ఫుడ్ డెలివరీ చేసేందుకు సుస్థిరమైన, సురక్షితమైన టెక్నాలజీ దిశగా పనిచేస్తున్నామన్నారు. అయితే డ్రోను ద్వారా ఆహారాన్ని అందించే ప్రయోగాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం పొందిన ఒక రిమోట్ సైట్ ప్రాంతంలో చేశామని జొమాటో ప్రతినిధులు పేర్కొన్నారు.  

Wed, Jun 12, 2019, 08:57 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View