సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో విలేకరులతో చిట్ చాట్ చేసిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు ఇస్తే పార్టీ బలోపేతానికి మరింతగా పని చేస్తానని చెప్పారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయమై విలేకరులు ప్రశ్నించగా జగ్గారెడ్డి స్పందిస్తూ, వాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదని అన్నారు. పార్టీలోనే ఉంటూ గోతులు తవ్వే వారిపై అధిష్ఠానం దృష్టి సారించాలని కోరారు. వచ్చే నెల 10 నుంచి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి సమయం కేటాయిస్తానని చెప్పారు. 
Wed, Jun 12, 2019, 08:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View