రోడ్డుప్రమాదం నుంచి తప్పించుకున్న హీరో వరుణ్ తేజ్
Advertisement
టాలీవుడ్ యువ హీరో, మెగా వారసుడు వరుణ్ తేజ్ ఓ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తెలంగాణలో వనపర్తి జిల్లా కొత్తకోటకు సమీపంలో వరుణ్ తేజ్ కారు రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైంది.

  ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళుతున్న ఈ యువ కథానాయకుడి కారును మరో కారు ఢీకొట్టగా రెండు వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి. దాంతో వరుణ్ తేజ్ మరో వాహనంలో వెళ్లారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్నారు. రేపటి నుంచి బెంగళూరులో జరిగే ఈ సినిమా షూటింగుకి వరుణ్ తేజ్ హాజరవ్వాల్సి ఉంది. 
Wed, Jun 12, 2019, 08:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View