అమీర్ సూపర్ స్పెల్... ఆసీస్ ను కట్టడి చేసిన పాక్ బౌలర్లు
Advertisement
టాంటన్ లో రెచ్చిపోయి ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఓ దశలో ఫించ్, వార్నర్ దూకుడు చూస్తే స్కోరు 350 పైచిలుకు నమోదవుతుందని అంచనా వేసినా, లెఫ్టార్మ్ సీమర్ మహ్మద్ అమీర్ సూపర్ స్పెల్ తో పరిస్థితిని మార్చివేశాడు. 223/3 తో పటిష్టంతో ఉన్న ఆసీస్ అమీర్ 5 వికెట్ల ప్రదర్శనతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అమీర్ ధాటికి ఆసీస్ ఈ మ్యాచ్ లో 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.

వార్నర్ సెంచరీ చేసిన వెంటనే వెనుదిరగడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ భారీ స్కోర్లు సాధించలేకపోయారు. ఆసీస్ తన చివరి 7 వికెట్లను 84 పరుగుల తేడాతో చేజార్చుకుంది. అమీర్ 10 ఓవర్లలో 2 మెయిడన్లు వేసి కేవలం 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. షహీన్ అఫ్రీది భారీగా పరుగులిచ్చినా 2 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు, ఫించ్ 82 పరుగులు చేయగా, వార్నర్ 107 పరుగులు సాధించాడు.
Wed, Jun 12, 2019, 06:53 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View