కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్ల లక్ష్యంగా ఉగ్రదాడి
Advertisement
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఘటన మరువక ముందే మరోసారి భీకర దాడికి యత్నించారు. ఈసారి కూడా సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రనేడ్లు విసిరి కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్ వద్ద జరిగిన ఈ ఉగ్రదాడిలో ఐదుగురు సీఎఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. అయితే ఈ దాడిని భారత భద్రత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంత్ నాగ్ జిల్లాలోని కేపీ రోడ్ లో ఉన్న ఆక్స్ ఫర్డ్ ప్రజంటేషన్ స్కూల్ వద్ద ఈ దాడి జరిగింది. ప్రస్తుతం మరికొందరు ఉగ్రవాదులను హతమార్చేందుకు భద్రత బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
Wed, Jun 12, 2019, 06:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View