అదే రోజును ఖాయం చేసుకుంటోన్న నాగ్
Advertisement
నాగార్జున కథానాయకుడిగా 'మన్మథుడు 2' రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రకుల్ .. కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారని సమాచారం.

అయితే ఆగస్టు 15వ తేదీనే ప్రభాస్ 'సాహో' భారీ స్థాయిలో విడుదల కానుంది. అంతటి భారీ సినిమాకి అంత దగ్గరలో నాగ్ తన సినిమా విడుదల పెట్టుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా నాగ్ మాత్రం కథపై నమ్మకంతో ఆగస్టు 9న రావాలనే ఉద్దేశంతోనే ఉన్నారట. ఇక మరో విశేషమేమిటంటే, ఈ నెల 13వ తేదీన 'సాహో' టీజర్ ను విడుదల చేస్తున్నారు. అదే రోజున 'మన్మథుడు 2' టీజర్ ను కూడా వదలనున్నారు. ఈ రెండు టీజర్లలో ఏది ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి మరి.
Wed, Jun 12, 2019, 05:50 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View