యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
Advertisement
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవికి పోటీ పడుతున్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. గతంలో ఐఎంఎఫ్ లో కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో ప్రస్తుత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ మార్క్ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 31లోపు ఈ నియామకం జరగబోతోంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తులలో యూకే వెలుపలి వ్యక్తి రాజన్ ఒక్కరే అని సమాచారం. అయితే ఈ అంశంపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కానీ, రాఘురాం రాజన్ కానీ ఇంత వరకు స్పందించలేదు.
Wed, Jun 12, 2019, 05:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View