నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. కీలకమైన మాక్రో డేటా విడుదల కానున్న నేపథ్యంలో... ఉదయం నుంచి మార్కెట్లలో ఊగిసలాట ధోరణి చోటు చేసుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు కోల్పోయి 39,756కి పడిపోయింది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 11,906 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.60%), ఓఎన్జీసీ (0.86%), వేదాంత లిమిటెడ్ (0.50%), సన్ ఫార్మా (0.47%), టీసీఎస్ (0.25%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.34%), మారుతి సుజుకి (-1.79%), కొటక్ మహీంద్రా (-1.65%), హీరో మోటోకార్ప్ (-1.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.23%). 
Wed, Jun 12, 2019, 04:43 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View