ఉభయ సభల్లో బీజేపీ పక్ష నేతల జాబితా విడుదల
ఉభయ సభల్లో బీజేపీ పక్ష నేతల జాబితా విడుదలైంది. ఈ జాబితాను బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ విడుదల చేసింది. బీజేపీ లోక్ సభాపక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తుండగా, ఉపనేతగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికయ్యారు. రాజ్యసభాపక్ష నేతగా థావర్ చంద్ గెహ్లాట్, ఉపనేతగా పీయూష్ గోయల్ పేర్లను ఖరారు చేసినట్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా, బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. రేపు ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ పదాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు.
Wed, Jun 12, 2019, 04:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View