ఆది పినిశెట్టి ద్విభాషా చిత్రం లాంచ్
Advertisement
ఆది పినిశెట్టి ఒక వైపున ఇతర హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున హీరోగా తనకి వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించాడు. తాజాగా ఈ సినిమా ఈ రోజున హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంలో కొనసాగనుంది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి 'క్లాప్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తున్న ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. కార్తికేయన్ - రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Wed, Jun 12, 2019, 04:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View