గాల్లో బాంబులా పేలిన స్పైస్ జెట్ విమానం టైరు
Advertisement
స్పైస్ జెట్ కు చెందిన ఓ విమానం ఇవాళ పెద్ద ప్రమాదం తప్పించుకుంది. విమానం గాల్లో ఉండగానే టైరు పేలిపోయింది. దుబాయ్ నుంచి జైపూర్ బయల్దేరిన ఈ విమానం సగం ప్రయాణం చేశాక విమానం టైర్లలో ఒకటి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. మొత్తానికి ఏదో జరిగిందని భావించిన స్పైస్ జెట్ సిబ్బంది, విమానానికి సమస్య ఏర్పడిందని జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అత్యవసర సమాచారం అందించారు. దాంతో, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆ సమయంలో స్పైస్ జెట్ విమానంలో 198 మంది ఉన్నారు. ఎట్టకేలకు విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందికి దించారు. వెంటనే ఫ్లయిట్ లో ఉన్న అందరినీ కిందికి దింపేశారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించి చూడగా విమానం టైరు పేలిపోయి కనిపించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబాయ్ తిరిగి వెళ్లాల్సి ఉండగా, మరమ్మతుల నిమిత్తం సర్వీసు రద్దు చేశారు.
Wed, Jun 12, 2019, 03:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View