కోల్ కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం
కోల్ కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను, తృణమూల్ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులు ఆపాలని నినదించారు. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై బాష్పవాయువు, వాటర్ కేనన్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు హెచ్చరించారు.
Wed, Jun 12, 2019, 03:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View