'చాణక్య' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్
Advertisement
గోపీచంద్ కథానాయకుడిగా 'తిరు' దర్శకత్వంలో 'చాణక్య' రూపొందుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ రోజున గోపీచంద్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'చాణక్య' సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం రంగంలోకి దిగిన కథానాయకుడు, ఆ పనిలో నిమగ్నమైనట్టుగా ఈ పోస్టర్ లో గోపీచంద్ కనిపిస్తున్నాడు. గోపీచంద్ డిఫరెంట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో గోపీచంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
Wed, Jun 12, 2019, 03:16 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View