చంద్రుడి రహస్యాలపై కన్ను.. చంద్రయాన్-2 ప్రయోగ తేదీని ఖరారు చేసిన ఇస్రో!
Advertisement
చంద్రుడిపై మరోసారి భారత జెండాను రెపరెపలాడించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సిద్ధమయింది. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లేషించేందుకు చంద్రయాన్-2ను చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. 2019, జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.

జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా మూడు పరికరాలు.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లు ఉంటాయన్నారు. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు.
Wed, Jun 12, 2019, 02:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View