ప్రధాని మోదీ క్రికెట్ దౌత్యంపై సచిన్ వ్యాఖ్యలు
Advertisement
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ కు క్రికెట్ బ్యాట్ బహూకరించడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వరల్డ్ కప్ లో ఆడుతున్న భారత క్రికెటర్లు సంతకాలు చేసిన ప్రత్యేక బ్యాట్ ను మోదీ తనతో పాటు మాల్దీవుల పర్యటనకు తీసుకెళ్లి అధ్యక్షుడు సోలిహ్ కు సుహృద్భావ కానుకగా ఇచ్చారు. మాల్దీవుల్లో కూడా క్రికెట్ ఆట అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే బ్యాట్ ను ఇస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై సచిన్ వ్యాఖ్యానిస్తూ, మాల్దీవుల పర్యటనలో ప్రధాని మోదీ క్రికెట్ దౌత్యం ప్రదర్శించారంటూ ప్రశంసించారు.

క్రికెట్ ను మరింత వ్యాప్తి చేసే క్రమంలో ప్రపంచవేదికపై ఆటకు మద్దతు పలికినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మాల్దీవుల్లో కూడా క్రికెట్ ఆట కనువిందు చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ఆటను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీరు చూపిస్తున్న చొరవ అభినందనీయం అంటూ మోదీపై ప్రశంసలు జల్లు కురిపించారు.
Wed, Jun 12, 2019, 02:38 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View