ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో లవ్ లో ఉన్నాను!: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య విచిత్రమైన అనుబంధం సాగుతోంది. అణు నిరాయుధీకరణ విషయంలో కొద్దికాలం క్రితం వరకూ ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రేమ సందేశాలు పంపించుకుంటున్నారు. తాజాగా ఉత్తరకొరియా అధినేత కిమ్ తనకు లేఖ రాసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

అణు నిరాయుధీకరణ విషయంలో ఉత్తరకొరియావైపు నుంచి ఇంకా ఎలాంటి పురోగతి లేదన్నారు. అయినా కిమ్ మాటమీద నిలబడతారన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను, కిమ్ ప్రేమలో ఉన్నామని చమత్కరించారు. ఉత్తరకొరియా అణు ఆయుధాలను త్యజిస్తే అభివృద్ధికి సహకరిస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ట్రంప్-కిమ్ రెండుసార్లు సమావేశమయినప్పటికీ, ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు.
Wed, Jun 12, 2019, 02:37 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View