నేనేమీ ఫస్టుక్లాస్ స్టూడెంటును కాదు: హీరోయిన్ ప్రియా వారియర్
Advertisement
యూత్ లో ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వుంది. తన క్రేజ్ మరింత పెంచుకునే సినిమాలు చేసే పనిలో ఆమె వుంది. తాజాగా ఒక హిందీ సినిమా చేస్తోన్న ఆమె, తెలుగులోను చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమాను చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి కదా అని చదువు ఆపేయమని నా తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. మా టీచర్స్ కూడా ముందు చదువు పూర్తిచేయమనే అంటూ వుంటారు. కాలేజ్ కి వచ్చేయమని అంటుంటారు. కానీ నిజానికి నేనేమీ ఫస్టు క్లాస్ స్టూడెంటును కాదు .. పైగా నాకు నటన అంటేనే ఇష్టం. అయినా మరో ఏడాదిలో డిగ్రీ పూర్తిచేసేస్తాను. ఆ తరువాత సినిమా అవకాశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. 
Wed, Jun 12, 2019, 02:00 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View