మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టిన 'వి' టీమ్
Advertisement
ఒక వైపున నాని .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' చేస్తూనే, మరో వైపున ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు కూడా నటిస్తోన్న ఈ సినిమా ఆల్రెడీ తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఈ రోజునే మొదలైంది. ఈ విషయాన్ని సుధీర్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

 ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. నాని జోడీగా నివేదా థామస్ .. సుధీర్ బాబు సరసన అదితీరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంద్రగంటితో నానీకి ఇది మూడవ సినిమా కావడం విశేషం.
Wed, Jun 12, 2019, 01:12 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View